Ram Charan: మాట ఇస్తే ప్రాణం పోయినా మాట తప్పను…. దిల్ రాజుకు ప్రామిస్ చేసిన చరణ్?

Ram Charan: రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా విడుదల అయింది అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోవాలని నిర్మాత దిల్ రాజు సైతం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తన నిర్మాణ సంస్థలో ఈ చిత్రం 50వ సినిమా కావడంతో ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ గా ఉండాలని భావించి నీళ్ళలా డబ్బును ఖర్చు చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచింది.

దీంతో ఒక్కసారిగా నిర్మాతకు కోలుకోలేని నష్టాలు వచ్చాయని చెప్పాలి ఇప్పటికి ఇంకా ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లలోనే నడుస్తుంది బ్రేక్ ఈవెన్ కావాలి అంటే భారీగా రాబట్టాల్సి ఉంటుంది. ఇలా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం అసాధ్యమని స్పష్టం అవుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో చరణ్ దిల్ రాజుకు ఒక మాట ఇచ్చారని ఇటీవల ఒక సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నారు.

ఇలా ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే మరోసారి దిల్ రాజు నిర్మాణంలో ఈయన సినిమా చేయబోతున్నారని ఆ సినిమా కోసం తాను రూపాయి కూడా రెమ్యూనరేషన్ లేకుండా నటిస్తాను అంటూ ప్రామిస్ చేశారట. రామ్ చరణ్ ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాట తప్పరని దిల్ రాజు తెలియజేశారు. ఈ సినిమా కోసం రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమా మంచి మార్కెట్ జరుపుకొని మంచి సక్సెస్ అయితేనే తనకు కొంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాలని లేకపోతే రెమ్యూనరేషన్ కూడా అవసరం లేదని చరణ్ చెప్పినట్టు దిల్ రాజు వెల్లడించారు.