Ram Charan and NTR : సెంచరీని టచ్ చేయనున్న చరణ్ – ఎన్టీయార్.!

Ram Charan and NTR : ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌తో చరణ్, ఎన్టీయార్‌లు తమ తమ రెమ్యునరేషన్లను అమాంతం పెంచేయనున్నారట. 100 కోట్ల రెమ్యునరేషన్ లిస్టులోకి చరణ్, ఎన్టీయార్ చేరిపోయేలా వున్నారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయ్. అయితే, అన్ని సినిమాలూ ‘ఆర్ఆర్ఆర్’ అవ్వలేవు కదా.
నిజానికి రెమ్యునరేషన్ విషయంలో ఈ ఇద్దరు హీరోలూ హద్దుల్లోనే వుంటారు. నిర్మాతలపై ఎలాంటి ఒత్తిడి వుండదు వీరి నుంచి. కానీ, వచ్చిన సక్సెస్ అలాంటిది. దాంతో, నిర్మాతలే చరణ్, ఎన్టీయార్‌లకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నారట.
ఇక, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ తమ తమ సినిమాల్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో చరణ్, ఎన్టీయార్ నేర్చుకున్నారట. రాజమౌళి పక్కనే వుండి, దేశం మొత్తం తిరిగిన అనుభవంతో మార్కెటింగ్ కిటుకులు ఎలా వుంటాయో రాజమౌళి నుంచి చక్కగా అర్ధం చేసుకున్నారట.
సో, ఈ ఇద్దరు హీరోలూ తర్వాత చేయబోయే అన్ని సినిమాలూ ప్యాన్ ఇండియా మూవీలే కావచ్చనడం అతిశయోక్తి కాదేమో. ఆ లెక్కన 100 కోట్ల రెమ్యునరేషన్ వీరిద్దిరికీ సబబే కావచ్చుగా.
మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్‌లోనే కాదు, మిగిలిన అన్ని భాషల్లోనూ అదే రేంజ్‌లో పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిపోతోంది.