Ram Charan-Balakrishna: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్. ఓటీటీ ఆహాలో ఈ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షో కి ఎంతో మంది రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇకపోతే చివరగా వెంకటేష్, అనిల్ రావిపూడి హాజరైన విషయం తెలిసిందే. వీరితోపాటు సురేష్ బాబు సైతం హాజరయ్యారు. ఇకపోతే అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు అంచనా వేసినట్టు నెక్స్ట్ ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నారు. కాగా తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో డాకు మహారాజ్ టీమ్ తమన్, డైరెక్టర్ బాబీ, నాగవంశీ వచ్చి రచ్చ చేసారు. ఈ ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు. అలాగే ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ రానున్నాడు. ఇప్పటికే చరణ్, బాలయ్య కలిసిన ఫోటోలు, వీడియలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఎపిసోడ్ కి చరణ్ తో పాటు మరో ముగ్గురు వచ్చారని సమాచారం. రామ్ చరణ్ తో పాటు అన్‌స్టాపబుల్ షోకి చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ హీరో శర్వానంద్, యువ నిర్మాత విక్రమ్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది.
శర్వానంద్ కూడా అన్‌స్టాపబుల్ సెట్స్ కి వచ్చిన కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. అలాగే చరణ్ పెట్ డాగ్ రైమ్ కూడా బాలయ్య షోలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. రైమ్ సోషల్ మీడియాలో పేజీలో రైమ్ ఫోటో షేర్ చేసి.ఇట్స్ షో టైం. 2025 లో చూడండి అంటూ రాసుకొచ్చారు. దీంతో బాలయ్య అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్, శర్వానంద్, విక్రమ్ రెడ్డి, చరణ్ పెట్ డాగ్ రైమ్ కనపడనున్నారు. ఇకపోతే జనవరి 10న విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.