దిల్ సే షోలో ఎమోషనల్ వద్దు కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల… కారణం అదేనా?

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జీ తెలుగులో దిల్ సే అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజీవ్ కనకాల ప్రముఖ నటుడు,డైరెక్టర్ దేవదాస్ కనకాల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన కూడా ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈయన తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొని వేదికపై ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో రాజీవ్ కనకాల వేదికపై కన్నీళ్లు పెట్టుకొని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఇలా ఈయన కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఆయన తండ్రి దేవదాస్ కనకాల గారని చెప్పాలి.ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి గురించి కొన్ని మాటలు చెప్పాలి అని చెప్పగా ఆయన గురించి రాజీవ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా శ్రీముఖి, సుధీర్ రాజీవ్ కనకాలకు ఒక కానుక ఇచ్చారు.

Rajeev Kanakala Emotional Promo | Thank You Dilse | Father's & Music Day Special Event | 19June, 6PM

రాజీవ్ కనకాల ఆ కానుక ఓపెన్ చేసి చూడగా వేదికపై కన్నీటిపర్యంతమయ్యారు. జీతెలుగు వారు రాజీవ్ కనకాలకు ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి దేవదాస్ కనకాల విగ్రహాన్ని బహుమతిగా అందజేయడంతో ఈయన ఎంతో ఎమోషన్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇకపోతే ఈయన నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించి సందడి చేశారు.