Rajinikanth : ఒక లెక్కలో హైప్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ అనౌన్సమెంట్.!

Rajinikanth : ఇప్పుడు అంటే పాన్ ఇండియా సినిమా హీరోల స్టార్డం అంటూ కొన్ని మాటలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కానీ వీటి అన్నిటిని మించి మన దేశానికి చెందిన ఒక హీరోకి ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో అక్కడి హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరన్న ఉన్నారు అంటే ఒక్క సూపర్ స్టార్ రజినీ కాంత్ మాత్రమే అని చెప్పాలి.

జపాన్ లో అయితే హాలీవుడ్ హీరో జాకీచాన్ తో సమాన క్రేజ్ ఉంది. మరి అలాంటి క్రేజ్ ఉన్న తలైవర్ కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది. ఎనలేని హైప్ నెలకొల్పుకున్నా “కబాలి” ప్లాప్ తర్వాత తన మార్కెట్ బాగా పడింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా తన రేంజ్ వి కాదు అనిపించింది.

కానీ ఇప్పుడు మాత్రం రజిని తన అందరి అభిమానులకు ఒక అదిరే హైప్ ని అయితే ఇచ్చారు. లేటెస్ట్ గా తన 169వ సినిమా అనౌన్స్ చెయ్యడం జరిగింది. తమిళ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ నెల్సన్ దిలీప్ కుమార్, స్టార్ కంపోజర్ అనిరుద్ మరియు స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ కాంబోలో సినిమాపై డిజైన్ చేసిన అనౌన్సమెంట్ వీడియో కానీ అందులో రజినీ లుక్ గాని వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పాల్సిందే. దీనితో ఈ భారీ అనౌన్సమెంట్ తో ఒక్కసారిగా ఈ చిత్రంపై గట్టి హైప్ నెలకొంది. దీనితో అయితే రజిని మళ్ళీ తన రేంజ్ రీఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.