Chiranjeevi: చిరంజీవి అంకుల్ అంటే నాకు పిచ్చి…. ఆయనే నా క్రష్… స్టార్ డాటర్ షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏ విధమైన సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలచారని చెప్పాలి. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న చిరు ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చామంటూ ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈయన గురించి తెలిపారు అయితే తాజాగా ఒక స్టార్ హీరో డాటర్ చిరంజీవి నా క్రష్ అంటూ చెప్పటం హాట్ టాపిక్ గా మారింది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ సౌందర్య రజనీకాంత్ గురించి మనకు తెలిసిందే. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ నటుడు ధనుష్ ను వివాహం చేసుకొని దాదాపు 18 సంవత్సరాలపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. అయితే కొన్ని భేదాభిప్రాయాలు కారణంగా ఇప్పుడు విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య ధనుష్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను తలైవా కూతుర్ని ఆయన పై నాకు ఎలాగో ఇష్టం ఉంటుంది నాన్న కాకుండా తనకు ఇష్టమైన హీరో ఎవరు అంటే చిరంజీవి అంకుల్ అని తెలిపారు. చిరంజీవి అంకుల్ అంటే నాకు పిచ్చి. చిన్నతనంలో ఆయన డ్యాన్స్ పై విపరీతమైన ఇష్టం ఉండేది. బంగారు కోడిపెట్ట సాంగ్ ని రిపీట్ గా చూసేదాన్ని అంటూ ఐశ్వర్య ఆ సాంగ్ పాడి సర్ప్రైజ్ చేశారు. ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కుమార్తెకు చిరంజీవి అంటే క్రష్ అని ఆయన తన అభిమాన హీరో అని తెలియడంతో మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐశ్వర్య కూడా ఇండస్ట్రీలో నిర్మాతగాను దర్శకురాలిగా కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.