దసరా కానుకగా అదిరే అప్డేట్ ఇచ్చిన రజినీ.!

Rajinikanths Annathe Teaser Breaks Records On Social Media | Telugu Rajyam

ఆల్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “అన్నాత్తే”. కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రం నిన్ననే టీజర్ కూడా వచ్చి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది. అయితే తెలుగులో 12 కోట్ల మేర బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం తెలుగు పోస్టర్స్ కానీ టైటిల్ కానీ ఇంకా రివీల్ కాలేదు. కానీ ఇప్పుడు దసరా కానుకగా ఎట్టకేలకు రజినీ అదిరే అప్డేట్ ని ఇచ్చేసారు.

ఈ చిత్రాన్ని తెలుగులో “పెద్దన్న” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా రెండు భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ డి ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles