తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీ కాంత్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినిమా వస్తుంది అంటే ప్రభుత్వాలే సెలవులు ప్రకటించే పరిస్థితి వస్తుంది. మరి అలాంటి రజినీకి కూడా ఇప్పుడు టైం బాగోలేదు దీనితో తాను నటించిన లేటెస్ట్ సినిమా “అన్నాత్తే” తో దాన్ని భర్తీ చెయ్యాలని రజినీ చూస్తున్నారు. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా మళ్ళీ రజినీ క్రేజ్ కి అద్దం పట్టేలా కనిపిస్తుంది.
ఈ చిత్రాన్ని యూఎస్ మార్కెట్ లో కనీవినీ ఎరుగని రీతీలో ఈ కరోనా రెండో వేవ్ తర్వాత రిలీజ్ కి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారట. భారీ టికెట్ ధరతో పాటుగా అత్యధిక ప్రదేశాల్లో దాదాపు 500 ప్రాంతాల్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.
అంతేకాకుండా ఈ సినిమా విషయంలో వారు చాలా నమ్మకంగా ఉన్నారని అందుకే ఇంత స్థాయిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. మరి ఈ సినిమాతో అయినా రజినీ మళ్ళీ తన స్టార్డం కి తగ్గ హిట్ అందుకుంటారో లేదో చూడాలి. ఈ సినిమానే తెలుగులో “పెద్దన్న” పేరిట దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.