Rajendra Prasad: విమర్శలపై ఘాటుగా స్పందించిన రాజేంద్రప్రసాద్.. నేనేంటో అందరికీ తెలుసు అంటూ!

Rajendra Prasad: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కమెడియన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈయన ఎక్కువగా వరుసగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు కాంట్రవర్సీ విషయాలలో ఎక్కువగా నిలుస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. అయితే కొద్దిరోజుల క్రితం రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్లో డేవిడ్ వార్నర్ ని అనుకోకుండా ఒక మాట అనడంతో రాజేంద్రప్రసాద్ ని ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో క్షమాపణ కూడా చెప్పారు రాజేంద్రప్రసాద్. అయితే తాజాగా మరొకసారి స్టేజిపై అయిన మాట్లాడుతూ బూతు పదం వాడి విమర్శల పాలయ్యారు. ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకుల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న‌తో ప‌ని చేసిన న‌టీన‌టులంతా హాజ‌రు అయ్యారు. ఈ వేడుక‌కు సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర‌ ప్ర‌సాద్ సైతం హాజ‌రు అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. అనుకోకుండా అలీని ఒక బూతు ప‌దంతో ప్ర‌స్తావించి మ‌నం ఇలాగే మాట్లాడుకుంటాం క‌దా అని అన్నారు. స్టేజీపై ఇలా అంద‌రి ముందు అలీని అన‌డంతో రాజేంద్ర‌ప్ర‌సాద్ పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా వీటిపై రాజేంద్ర ప్ర‌సాద్ స్పందించారు. ష‌ష్టిపూర్తి స‌క్సెస్ మీట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. నేను సరదాగా ఉంటాను అందరితో. వాళ్ళు నాతో అలాగే ఉంటారు. ఇటీవల కొన్ని ఈవెంట్స్ లో వాళ్ళు నా వాళ్ళు అని తొందరగా అనేసిన మాటలను కొంతమంది తప్పు అని అంటున్నారు. అది మీ సంస్కారం. నేను ఇలాగే ఉంటాను. నేనేంటో అందరికి తెలుసు సరదాగా ఫ్లోలో అన్న మాటలను తప్పుగా తీసుకోవడం అది మీ సంస్కారం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.