Rajendra Prasad: ఈ సినిమా హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటా… చాలెంజ్ చేసిన రాజేంద్రప్రసాద్!

Rajendra Prasad: వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వేడుకలో భాగంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ సైతం ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇలా రాజేంద్రప్రసాద్ ఈ సినిమా వేడుకలో భాగంగా మాట్లాడుతూ.. నా సినీ కెరియర్ లో ఎన్నో క్లాసిక్ హిట్ సినిమాలు ఉన్నాయి అలాంటి వాటిలో రాబిన్ హుడ్ సినిమా కూడా చేరుతుందని ఈయన తెలియజేశారు. ఈ సినిమాలో నటిస్తున్న అంతసేపు నాకు నా పాత రోజులు అనగా నేను హీరోగా సినిమాలు చేసే రోజులు గుర్తుకు వచ్చాయని తెలియజేశారు.

ఇటీవల కాలంలో కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులుగా మారిపోతున్నాయి కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ ఉండదని ఈ సినిమా స్వచ్ఛమైన కామెడీతో మీ అందరిని మెప్పిస్తుందని తెలిపారు. కుటుంబంతో కలిసి ఎంతో హాయిగా నవ్వుకుంటూ చూసే సినిమాగా ఈ చిత్రం ఉంటుందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. సినిమా విడుదలైన తర్వాత నేను చెప్పిన విధంగా సినిమా లేకపోతే కచ్చితంగా నా పేరును మార్చుకుంటాను అంటూ ఈయన తెలిపారు.

ఇలా సినిమా నచ్చకపోతే నా పేరు మార్చుకుంటాను అంటూ రాజేంద్రప్రసాద్ మాట్లాడటంతో ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు ఇన్నేళ్ల తన సినీ కెరియర్లో రాజేంద్రప్రసాద్ ఏ సినిమా గురించి కూడా ఇలా చెప్పలేదు కానీ ఈ సినిమా గురించి ఇలా మాట్లాడటంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.