Rajasekhar Knows The Truth About Chiranjeevi : మెగాస్టార్ మంచితనం రాజశేఖర్ గుర్తించిన వైనం.!

Rajasekhar Knows The Truth About Chiranjeevi

Rajasekhar Knows The Truth About Chiranjeevi : మెగా కాంపౌండ్ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే, జీవిత, రాజశేఖర్ దంపతులకు అస్సలు పడదు. విషయం వున్నా, లేకున్నా, మెగాస్టార్ విషయంలో కాస్త వులుకెక్కువ ఈ జంటకి. సందు దొరికితే చాలు, మెగాస్టార్ చిరంజీవి మీద అవాకులు చవాకులు పేలడానికి రెడీ అయిపోతుంటారు.

కానీ, నిజానికి మెగాస్టార్ ముందు జీవితా రాజశేఖర్ దంపతులకు అంత సీను, సినిమా లేదనేది చాలా మందికి తెలిసిన నిక్కర్చయిన నిజం. కేవలం ఎవరో చెప్పారనీ, ఎవరి రాజకీయ అవసరాలో తీర్చడానికే జీవితా రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు.

ఆ అక్కసుతోనే ఆయన పర్సనల్ లైఫ్‌ని డిస్ట్రబ్ చేయడమే కాదు, ఓ మంచి ఆశయం కోసం నిర్వహిస్తున్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీదా రాజశేఖర్ దంపతులు పలు విమర్శలు చేశారు. ఇదంతా 2009 ఎన్నికల సమయంలో జరిగిన ముచ్చట. ఆ చిచ్చు ఇప్పటికీ అలా అలా రాజుకుంటూనే వుందనుకోండి.

అయితే, అలా చేయడం వల్ల అప్పట్లో రాజకీయంగా కొంత తాత్కాలిక లబ్ఢి చేకూరింది రాజశేఖర్ దంపతులకి. ఆర్ధికంగా బాగా నిలదొక్కుకున్నారు కూడా. కానీ, వ్యక్తిత్వం కోల్పోయారనేది నమ్మదగ్గ నిజం. అది తెలిసొచ్చేసరికి తప్పయిపోయిందంటూ చిరంజీవిని శరణు కోరారు రాజశేఖర్ దంపతులు.

అవును నిజమే, చిరంజీవి శిఖరం, తాత్కాలికంగా ఎవరు తనని ఇబ్బంది పెట్టినా పెద్ద మనసుతో క్షమించేస్తుంటారు. అలాగే తప్పు తెలుసుకుని శరణు కోరి వచ్చిన జీవిత దంపతుల్ని చిరంజీవి క్షమించేశారు.