M.M.Sreelekha: ప్రముఖ నిర్మాత రాజమౌళి గారి ఇంటి పేరు ఎస్ఎస్ కాదు అని సింగర్ శ్రీలేఖ అన్నారు. అది పూర్తి పేరులో షార్ట్ ఫాం మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. మణిమేఖల శ్రీలేఖ అంటే ఎం ఎం శ్రీలేఖ అని, మరకతమని కీరవాణి అంటే ఎమ్ ఎమ్ కీరవాణి అని, శ్రీశైల శ్రీ రాజమౌళి అంటే ఎస్ ఎస్ రాజమౌళి అని, అసలు ఇంటి పేరు కోడూరు అంటే కె లెటర్ వస్తుందని ఆమె స్పష్టం చేశారు.
తమ అందరికీ కూడా తన నాన్న గారే పేరు పెట్టారని, మామూలుగా అయితే జన్మ నక్షత్రాన్ని బట్టి పేరు పెడతారని కానీ నాన్న గారు మాత్రం అలా పెట్టరని శ్రీలేఖ అన్నారు. ఆయన దేవుణ్ణి బాగా నమ్ముతారు. కానీ ఇలాంటి రాశులు, నక్షత్రాలు మాత్రం నమ్మరని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన డైరెక్ట్ గా అమ్మవారు ఏం చెప్తే అదే చేస్తారని శ్రీలేఖ అన్నారు. ఆయన పూజ గదిలోకి వెళ్లి పూజ మాత్రమే కాకుండా మెడిటేషన్ లాంటి ప్రక్రియ కూడా చేస్తారని ఆమె అన్నారు. అలా చేస్తున్నప్పుడు ఆయనలో కొన్ని విజన్స్ వస్తాయని, అంటే ఈ రోజు ఈ పని చేయకూడదు అంటే తాము చేయమని, ఈ రోజు ఈ రంగు బట్టలు వేసుకోకూడదు అంటే వేసుకోము అని ఆమె స్పష్టం చేశారు.
ఇకపోతే తను స్వశక్తితో తప్ప ఎవరి వలన కూడా తాను పైకి రాలేదని శ్రీలేఖ చెప్పారు. తన ఫ్రెండ్స్ రిఫరెన్స్ తీసుకోవడానికి కూడా తనకు ఇష్టం ఉండదని ఆమె తెలిపారు. తనకు సినిమాల్లో నటించాలని ఇష్టం ఉందని తన అభిప్రాయం వెల్లడించారు. ఇప్పటివరకు చాలా అవకాశాలు కూడా వచ్చాయని అందులో ఏవీ తనకు నచ్చలేదని శ్రీలేఖ చెప్పారు. ఈ మధ్య కాలంలో కూడా తనకు రెండు అవకాశాలు వచ్చాయని, అవి కూడా నెగటివ్ రోల్ లో చేయమని అడిగారని ఆమె అన్నారు. కానీ ఒప్పుకోలేదని శ్రీలేఖ తెలిపారు. కానీ తనకు మాత్రం మ్యూజిక్ కి సంబంధించిన క్యారెక్టర్ ఏదైనా చేయాలని ఉందని స్పష్టం చేశారు.