Rajamouli: RRR ప్రమోషన్స్ కోసం కొత్త ప్లాన్ లో రాజమౌళి….!

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR క్రేజ్ మాములుగా లేదు పాన్ ఇండియా లెవెల్ లో మూవీ కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోస్ ఇందులో ఉండటంతో సినిమా పై అంచనాలు మాములుగా లేవు.ఇక ఈ సినిమా జనవరి లోనే సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా కోవిడ్ -19 పరిస్థితుల వల్ల వాయిదా పడింది.
భారీగా ప్రొమోషన్స్ చేసిన తర్వాత సినిమాకి బ్రేక్ పడటంతో చిత్ర యూనిట్ కాస్త డీలా పడింది. కాగా ఇపుడు మార్చ్ 25న ప్రపంచం వ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్దమవుతోంది.

దీంతో మార్చి మొదటివారం నుండి ప్రొమోషన్స్ తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ముంబై లో ప్రొమోషన్స్ ఆల్రెడీ మొదలుపెట్టిన RRR టీం సౌత్ ప్రొమోషన్స్ కోసం భారీ ప్లాన్ లు వేస్తోంది.
తెలుగులో పెద్ద ఈవెంట్స్ ప్లాన్ చేయాలనీ రాజమౌళి అనుకుంటున్నారట అయితే ఈ వివరాలన్నీ మార్చి మొదటి వారంలో చిత్ర బృందం కరణం కారణం వల్ల ఇప్పటికే వాయిదా పడిన చిత్రాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే మార్చిలో పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ అవడంతో సినీ ప్రేక్షకుల పండగనే చెప్పాలి. ఇక RRR లో అల్లూరి సీత రామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్ర లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడిగా ఆలియా భట్ నటిస్తుండగా ఓలివా మోరీస్, శ్రీయ, అజయ్ దేవగన్, సముద్రఖని ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.అయితే ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన చిత్రబృందం తిరిగి మరోసారి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో, రాజమౌళి ఎలా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడో మార్చి 25 వరకు వేచి చూడాలి.