రాజమౌళి సినిమా అంటే చాలా ఓపిక ఉండాలి. ఆయనతో సినిమా చేయాలి అనుకుంటే కనీసం రెండేళ్లు ఆయానకు అంకితం చేయాల్సిందే ఏ హీరో అయినా. అంటే రెండేళ్ల పాటు వెండితెర మీద కనబడరనే అర్థం. అప్పటివరకు ఆ హీరోల అభిమానులు ఉసూరుమంటూ ఉండాల్సిందే. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇదే సిట్యుయేషన్లో ఉన్నారు. ఇద్దరూ కలిసి జక్కన్న డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా మొదలై రెండేళ్లకు పైనే అవుతోంది. మధ్యలో లాక్ డౌన్ మూలంగా ఏడాది సమయం వృథా అయింది. దీంతో ఇద్దరు హీరోల కమిట్మెంట్ ఆలస్యం అవుతున్నాయి.
రాజమౌళి సినిమాను ముగించి శంకర్ సినిమాకు వెళ్లాలని అనుకుంటున్నాడు రామ్ చరణ్. ఎన్టీఆర్ కూడ ఎప్పుడెప్పుడు కొరటాల శివ ప్రాజెక్ట్ మొదలుపెడదామా అనే ఆలోచనలో ఉన్నాడు. తన హీరోల పరిస్థితిని అర్థం చేసుకున్న రాజమౌళి 40 రోజుల గడువు మాత్రమే పెట్టారట. ఇప్పటికే సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయింది. రామ్ చరణ్ షూట్లో జాయిన్ అయ్యాడు. ఈరోజు నుండి ఎన్టీఆర్ కూడ వారితో కలవడం జరిగింది. ఈ షెడ్యూల్ ఏకధాటిగా 40 రోజులపాటు జరగనుంది. దీని తరువాత హీరోలు ఇద్దరూ రాజమౌళి నుండి విడుదల పొందినట్టే. అంటే సెప్టెంబర్ లేదా ఆగష్టు నెలలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ కొత్త సినిమాలను పట్టాలెక్కిస్తారన్నమాట.