Rajamouli sensational plan : గాసిప్స్ : “RRR” తెలుగు ఈవెంట్ కి ఊహించని గెస్టులని ఫిక్స్ చేసిన రాజమౌళి?

Rajamouli sensational plan :  ప్రస్తుతం భారతీయ సినిమా దగ్గర పాన్ ఇండియా రిలీజ్ ల పర్వం మొదలైంది. అయితే ఈ రిలీజ్ లలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో సినిమానే ట్రిపుల్ ఆర్(RRR). మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా చేసిన మాసివ్ మల్టీ స్టారర్ ఇది.
దర్శకుడు రాజమౌళి చేసిన ఈ సినిమా ఇప్పుడు మరో వారంలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ భారీ సినిమాపై ఇప్పుడు మళ్ళీ వేరే లెవెల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రమోషన్స్ లో బిగ్గెస్ట్ ఎసెట్ ఏవన్నా ఉన్నాయి అంటే అవి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని చెప్పాలి.
ఇప్పటికే కర్నాటకా మరియు దుబాయ్ లలో భారీ ఈవెంట్స్ ని ప్లాన్ చెయ్యగా తెలుగు ఈవెంట్ పై ఉన్న అంచనాలు మాత్రం అనేకం. ఇప్పుడు ఈ ఈవెంట్ కె రాజమౌళి ఓ అదిరే ప్లాన్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం అయితే ఈ సినిమా ఇద్దరు హీరోల కుటుంబ పెద్దలను ప్రత్యేక అతిధులుగా పిలుస్తున్నారట.
అంటే మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లు రానున్నారట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ నిజం అయితే తెలుగు సినిమాలో చాలా ఏళ్ళకి మళ్ళీ ఇది ఒక సువర్ణ ఫ్రేమ్ గా మిగిలిపోతుంది అని చెప్పాలి.