RRR : “RRR” సినిమాకి పార్ట్ 2 ఉందా?? కన్ఫర్మేషన్ ఇచ్చిన రాజమౌళి.!

RRR : తనదైన సినిమాలతో ఇండియన్ సినిమా దగ్గర నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న మన టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. తన కెరీర్ లో ఒకదాన్ని మించి మరొకటి భారీ సినిమాలు చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని మరియు ఇండియన్ సినిమా పేరును పెంచుతూ వెళ్తున్నాడు.
అయితే ఇప్పుడు తాను చేసిన మరో భారీ విజువల్ వండర్ ట్రిపుల్ (RRR). మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రంపై ఇప్పుడు అంతకంతకూ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ సినిమాని నిజానికి ఎపుడో విడుదల చెయ్యాల్సి ఉంది.
కానీ అనూహ్యంగా తర్వాత వాయిదా మీద వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఫైనల్ గా ఈ నెల 25న నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అవుతుంది. మరి ఈ క్రమంలోనే ఇంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాపై మరికొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.
వాటిలో ఈ సినిమాకి సీక్వెల్ గా పార్ట్ 2 ఉంటుందా లేదా అనే దానిపై రాజమౌళి కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సినిమాకి ఎలాంటి పార్ట్ గాని సీక్వెల్ లేదని కేవలం ఒక్క సినిమాగానే తెరకెక్కించాం అని క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ భారీ సినిమాపై ఒక తుది క్లారిటీ అందరికీ వచ్చినట్టే అని చెప్పాలి.