Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం హీరోలను పిక్స్ చేసిన జక్కన్న.. ఎవరంటే?

Rajamouli: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.ఎప్పటికైనా మహాభారతం గురించి ఒక సినిమాను తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నట్లు మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహాభారతం సినిమాలో హీరోల ను ఫిక్స్ చేసినట్లు స్వయంగా రాజమౌళి వెల్లడించారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే ప్రమోషన్ కార్యక్రమాలలో రామ్ చరణ్ మాట్లాడుతూ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ లో మేమిద్దరం ఉంటామా? అని చరణ్ రాజమౌళిని ప్రశ్నిస్తే అందుకు రాజమౌళి స్పందిస్తూ..హా తప్పకుండా వుంటారని సమాధానం చెప్పారు. దీంతో మహాభారతం సినిమాలో కూడా మరోసారి ఎన్టీఆర్ రామ్ చరణ్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే మహాభారతం ప్రాజెక్ట్ పట్టాల ఎక్కడానికి మరి కాస్త సమయం పడుతుంది. ఇలా రాజమౌళి మహాభారతం సినిమా గురించి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే RRR సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా తారక్ కొమరం భీమ్ పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క అభిమాని, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.