హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుసింది. కింగ్ కోఠి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్,సికింద్రాబాద్, చిలకలగూడ, పద్మారావు నగర్, నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, నారాయణగూడలో చిరు జల్లులు పడ్డాయి. నగరంలో ఆకాశం మేఘావృతంగా ఉంది. అక్కడక్కడా మోస్తరు వర్షం కురవడంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ఎండ వేడి నుండి నగరవాసులకు ఉపశమనం లభించింది.