RRR : “RRR” ట్రైలర్ పై “రాధే శ్యామ్” దర్శకుడి తూటాల్లాంటి మాటలు!

RRR : ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా ట్రిపుల్ ఆర్(RRR) సినిమా ట్రైలర్ తో అంతా ఎంజాయ్ చేస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాసివ్ హీరోలతో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసిన విజువల్ మాస్ ట్రీట్ కి నెవర్ బిఫోర్ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది.
అయితే టాలీవుడ్ సహా బాలీవుడ్ వర్గాల నుంచి కూడా రాజమౌళి బ్రిలియెంట్ విజన్ కి దాసోహం అంటూ కితాబు ఇస్తుండగా.. ఈ రాజమౌళి సినిమాతో సంక్రాంతి బరిలో విడుదలకి రెడీగా ఉన్న మరి భారీ సినిమా “రాధే శ్యామ్” దర్శకుడు రాధా కృష్ణ తన తూటాల్లాంటి మాటలతో తన రెస్పాన్స్ ఈ సినిమా ట్రైలర్ పై తన స్పందన ఇచ్చారు.
రాజమౌళిని ఉద్దేశించి మాట్లాడుతూ మేము ఎప్పుడూ మిమ్మల్ని మా లోకపు దర్శకుడు అనుకుంటాము కానీ మీరు మాత్రం ఎప్పుడూ మా ప్రపంచంలో లేని డైరెక్టర్ లా ఆశ్చర్యపరుస్తారని మీ విజన్ ని మ్యాచ్ చెయ్యడం ఎవరి తరం కాదని ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ లు అయితే ఇద్దరూ ఒక్కో ఆటం బాంబ్ లాంటి పెర్ఫామెన్స్ తో దంచి కొట్టేశారని అదిరే ఎలివేషన్ లు ప్రభాస్ దర్శకుడు ఇచ్చాడు.