Puspha Movie: సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప డిసెంబర్ 17వ తేదీ విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన దక్కించుకుంది.సినిమా విడుదల కాకముందే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదల చేసి సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసినప్పటికీ ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయం అందుకోకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త పెదవి విరుస్తున్నారు.
ఇదిలా ఉండగా థియేటర్ లో విడుదలైన తర్వాత 50 రోజులకు ప్రతి ఒక్క సినిమా ప్రస్తుతం ఓటీటీలో విడుదలవుతూ వస్తున్నాయి ఈ క్రమంలోనే పుష్ప సినిమా కూడా త్వరలోనే ఓటీటీలో విడుదల కాబోతోంది అంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల అయ్యి రెండు రోజులు కాకుండానే అప్పుడే ఈ సినిమా ఓటీటీలో రాబోతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి
ఈ సినిమా గురించి ఈ విధంగా వార్తలు రావడానికి గల కారణం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయిందని చెప్పవచ్చు. థియేటర్లలో కలెక్షన్ల పరంగా వెనకడుగు వేసిన పుష్ప ఓటీటీలో విడుదల చేస్తూ లాభాలను పొందాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పుష్ప సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలతో సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు.అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు తగ్గితే నాలుగు వారాలలోపే
ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని భావించారు. ఈ లెక్కన చూస్తుంటే పుష్ప సినిమా సంక్రాంతికి ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.