Allu Arjun: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ సినిమా అంటే తప్పకుండా ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అలాగే ఈ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ఎంతో హైలెట్ అయ్యింది. ఇందులో సమంత నటించడం విశేషం. పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట ఏ రేంజ్ లో అయితే హిట్ అయిందో అదే రేంజ్ లో వివాదాలను కూడా ఎదుర్కొంటుంది.
ఈ పాట లిరిక్ మీ మగ బుద్ధి వంకర బుద్ధి అనే లిరిక్ పై పురుష సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పురుష సంఘాలు పాట రచయిత సింగర్ ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ పురుష సంఘాలు అయితే ఏకంగా ఈ పాటను బ్యాన్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ పై మొదటిసారిగా పుష్ప రాజు స్పందించారు.
“ஊ சொல்றியா மாமே!” பாடலில் வருவது உண்மை தானே…! அல்லு அர்ஜூன் பதில்..#AlluArjun #Pushpa pic.twitter.com/1TLqtscOe7
— Shruti TV (@shrutitv) December 14, 2021
ఈ సినిమా విడుదలకు ముందు పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న అల్లు అర్జున్ కు ఒక ఇంటర్వ్యూ లో భాగంగా విచిత్రమైన ప్రశ్న ఎదురయింది.మీ మగ బుద్ధి వంకర బుద్ధి అనే లిరిక్ పై వస్తున్న అభ్యంతరాల పై మీ స్పందన ఏంటి అంటూ అల్లు అర్జున్ ప్రశ్నించడంతో అందుకు బన్నీ తనదైన స్టైల్లో సమాధానం చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ లిరిక్ లో ఏ మాత్రం తప్పు లేదు అదే నిజం అంటూ షాకింగ్ ఆన్సర్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.