బాహుబలి రేంజ్‌లో ‘పుష్పక విమానం’ ప్రమోషన్.. ఎందుకంటే.!

‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.?’ అంటూ సరికొత్త వెర్షన్‌లో బాహుబలి సినిమాని ప్రమోట్ చేశాడు జక్కన్న రాజమౌళి. ఈ ప్రశ్నతో బాహుబలి సినిమా రాష్ర్టాలు, దేశాలు, ఖండాలు కూడా దాటేసినంత పని చేసింది. జనంలోకి జోరుగా దూసుకెళ్లిపోయింది. సరే, అది బాహుబలి సంగతి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ‘పుష్పక విమానం’ సినిమా ముచ్చట.

క్లాసిక్ టైటిల్ అయిన ‘పుష్పక విమానం’ టైటిల్ తీసుకోవడమనేది చాలా పెద్ద సాహసం. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ మాటల్లేకుండానే ప్రేక్షకుల్నినవ్వుల ఊయలూగించింది అప్పట్లో. ఆ టైటిల్ పెట్టినందుకు అంతకు ఏ మాత్రం తగ్గకుండా, ఈ జనరేషన్ సినీ ప్రియులకు నవ్వుల పూలు పూయించేందుకు సిద్ధమవుతోంది ఈ ‘పుష్పక విమానం’.

ఆనంద్ దేవరకొండ హీరోగా గీత్ షైనీ, శాన్వీ మేఘన హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణంలో విజయ్ దేవరకొండ కూడా ఓ చేయి వేసిన సంగతి తెలిసిందే. సుందర్‌ని మీనాక్షి ఎందుకు వదిలేసి వెళ్లిపోయింది.? అనే ప్రశ్న చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ ప్రశ్ననే రైజ్ చేస్తూ, ప్రమోషన్ చేస్తున్నారు మనం పైన చెప్పుకున్నట్లుగా బాహుబలి రేంజ్‌లో. మరి ఆ రేంజ్‌లో సినిమా సక్సెస్ అవుతుందా.? కాస్త దురాశే కానీ, లెట్స్ వెయిట్ అండ్ సీ.