సుకుమార్ క్రియేటివ్ డైరెక్టరే..అందులో నో డౌట్. డైరెక్టర్‌గా ఆయన టేకింగ్ ఊహలకు అందేలా ఉండదు. ‘రంగస్థలం’ సినిమా కోసం రామ్ చరణ్, సమంత, అనసూయ పాత్రలను ఎవ్వరూ ఊహించని విధంగా మార్చేశాడు. ప్రోమోల్లో ఈ పాత్రల లుక్స్ చూసి, కొందరు ఫ్యాన్స్ అబ్బో.. ఈ గెటప్స్‌లో వీళ్లని భరించగలమా.? అంటూ ఆయా క్యారెక్టర్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు.
కానీ, సినిమా రిలీజ్ తర్వాత మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అనే రేంజ్‌లో ఆయా పాత్రల చిత్రీకరణ తెరపై చూసి ముక్కున వేలేసుకున్నారు. నిజంగానే ఎవ్వర్ గ్రీన్ క్యారెక్టర్స్ అవి. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సుకుమార్ నుంచి రాబోతున్న ‘పుష్ప’, ‘రంగస్థలం’ తర్వాత మరో సంచలనం అయ్యేలా కనిపిస్తోంది.
మొదట ‘పుష్పరాజ్’ అంటూ బన్నీ లుక్‌కే స్టన్ అయిపోయిన ఫ్యాన్స్.. శ్రీవల్లిగా రష్మిక పాత్రను చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ‘మంగళం శ్రీను’గా సునీల్, ఇప్పుడు ‘దాక్షాయణి’గా అనసూయ పాత్రలు.. వేటికవే అన్నట్లుగా ఉన్నాయి. అయితే, అన్ని పాత్రల్లోనూ నెగిటివ్ ఛాయలే కనిపిస్తున్నాయి.
హీరో పాత్ర సైతం లుక్స్ వైజ్ నెగిటివ్ షేడ్‌లోనే కనిపిస్తోంది. సో ‘పుష్ప’ నిండా నెగిటివ్ క్యారెక్టర్లేనా.? అనే అనుమానాలు వస్తున్నాయి. అవి పోవాలంటే, సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.