Pushpa Trailer :”పుష్ప” ట్రైలర్ వాయిదా.. అయినా అదెలా ఉంటుందో పక్కా సమాచారం మీకోసం.!

Pushpa Trailer :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ప్రిస్టేజియస్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అవుతుండగా.. ఇప్పుడు ది మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ క్యూటీన్ ఈ చిత్ర యూనిట్ విడుదల చేసారు. భారీ హైప్ తో ఉన్న ఈ ట్రైలర్ అనుకున్న సమయానికి అయితే చిత్ర బృందం విడుదల చెయ్యకుండా ఆ హైప్ ని ఇంకా పెంచే ట్రిక్స్ చేస్తున్నారు.

అయితే మరి అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో పక్కా సమాచారం మీకోసం తీసుకొచ్చాం.. ఈ ట్రైలర్ నిడివి సుమారు 2 నిమిషాల 20 సెకండ్ లు కట్ చెయ్యగా మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో ఇది ఉంటుందట. అలానే ప్రతి పాత్ర తాలూకా భాష యాసని సుకుమార్ చాలా యూనిక్ గా డిజైన్ చేసారని సినీ వర్గాలు నుంచి సమాచారం. ఇంకా ఈ మాసివ్ ట్రైలర్ లో ఐకాన్ స్టార్ మెయిన్ హైలైట్ కాగా లాస్ట్ లో తనపై చూపించే విజువల్ ఔట్ స్టాండింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. అలానే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో ప్రధాన ఆకర్షణ ఈ ట్రైలర్. మొత్తంగా మాత్రం పాన్ ఇండియా విలువలు మ్యాచ్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ గా ఈ ట్రైలర్ ఉంటుందట. ఈ స్పేస్ లోనే దీనిని మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. సో ఓపికగా ఎదురు చూడాలి.