పుష్ప’ క్రేజ్.. దేశంలోనే రెండో స్థానం

Pushpa stood 2nd place in IMDB
Pushpa stood 2nd place in IMDB
అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది.  సుకుమార్ దర్శకత్వం కావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది.  విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ కి తెలుగులోనే కాదు మలయాళంలో కూడ మంచి క్రేజ్ ఉంది. అక్కడి ప్రేక్షకులు ఈయన్ను మల్లు అర్జున్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇదే ‘పుష్ప’ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆయన క్రేజ్ చిత్రాన్ని ఇండియాలోనే రెండవ స్థానంలో నిలబెట్టింది.
 
ఐఎండీబీ సంస్థ మోస్ట్ యాంటీసిపెటెడ్ న్యూ ఇండియన్ మూవీ జాబితాను తయారుచేసింది.  అంటే భారతీయ సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితా అన్నమాట. ఇందులో ప్రశాంత్ నీల్, యష్ యొక్క ‘కెజిఎఫ్-2’ 22.01 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా 15.7 శాతం ఓట్లతో ‘పుష్ప’ రెండవ స్థానం దక్కించుకుంది.  3వ స్థానంలో ‘హసీన్ దిల్ రుబా’ ఉండగా నాల్గవ స్థానంలో ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ ఉంది.  ‘బెల్ బాటమ్’ ఐదవ స్థానం, ‘తూఫాన్’ ఆరవ స్థానంలో ఉన్నాయి.  మొత్తానికి ‘పుష్ప’ ప్రభావం ప్రేక్షకుల మీద గట్టిగానే చూపిస్తోంది.