“స్పైడర్ మ్యాన్”కి “పుష్ప” ఎఫెక్ట్..డేట్ మార్చుకున్నారు.!

 
సినిమాల్లో పోటీ అనేది సర్వసాధారణం. అది ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఉంటుంది. అలాగే ఇతర భాషలు సినిమాలు మన సినిమాలు కూడా పోటీలో ఉన్న సందర్భాలు కూడా అనేకం. అయితే ఈ డిసెంబర్ 17న రిలీజ్ మాత్రం చాలా ఆసక్తిగా ఉన్నది. ఎందుకంటే ఈ డేట్ లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప పార్ట్ 1” పెద్ద ఎత్తున రిలీజ్ ఉంది. 
 
ఓవర్సీస్ లో ఏమో కానీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అయితే పుష్ప పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇదే డేట్ కి హాలీవుడ్ భారీ సినిమా “స్పైడర్ మేన్ నో వే హోమ్” కూడా రిలీజ్ కి ఉంది. ఇది కూడా మామూలు సినిమా అయితే కాదు. మన దేశంలో కూడా అన్ని భాషల్లోని రిలీజ్ కోసం చూస్తున్నారు. అయితే సరిగా ఈ రెండు సినిమాలూ ఒకే డేట్ కి విడుదల అనేది ఎలా ఉంటుందా అని ఏ సినిమాకి దెబ్బ పడుతుందా అని అనుకున్నారు. 
 
మరి ఎంత హాలీవుడ్ సినిమా అయినా లోకల్ ప్రియారిటీ లోకల్ కే ఉంటుంది. అందుకే ఆఖరికి స్పైడర్ మేన్ వారే తగ్గి ఒకరోజు ముందు రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారు. అంటే ఇండియన్ వెర్షన్ డిసెంబర్ 16న రిలీజ్ కానుంది. దీనితో 17 కన్నా మంచి ఓపెనింగ్స్ ఈ సినిమాకి దక్కడం ఖాయం. అలాగే ఓవర్సీస్ లో పుష్ప కి కష్టం.