పుష్ప – ‘సామీ..’ సాంగ్ రివ్యూ: రామలక్మిని మించిపోయిన శ్రీ వల్లి.!

‘అమ్మీ అమ్మీ అంటాంటే, నీ పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామీ..’ అంటూ సామీ సామీ.. పాటలో రష్మిక మాస్ స్టెప్పులు అదరగొట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మకా మండన్నా జంటగా ‘పుష్ప’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

డిశంబర్ 17న ‘పుష్ప – ది రైజ్’ టైటిల్‌తో ఈ సినిమా తొలి పార్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా, చిత్ర యూనిట్ ప్రమోషన్లు ఊదరగొట్టేస్తోంది. ఫ్యాన్స్‌ని ఊపిరి తీసుకోనివ్వకుండా, అప్‌డేట్స్ మీద అప్‌డేట్స్ ఇస్తూ ఖుషూ చేస్తోంది.

ఇక లేటెస్టు అప్‌డేట్‌లో భాగంగా రిలీజ్ చేసిన ‘సామీ’ పాట అయితే, మాస్ ఆడియన్స్‌కి నెక్స్‌ట్ లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందనడం అతిశయోక్తి కాదేమో. డీ గ్లామర్ రోల్స్‌లో రష్మిక, అల్లు అర్జున్ మాస్ స్టెప్పులు ఇరగదీసేస్తున్నారు.

ముఖ్యంగా రష్మిక అయితే, బెస్ట్ ఎవర్ పర్ఫామెన్స్ ఇచ్చిందనాలి. ‘రంగస్థలం’లో రామలక్ష్మి పాత్రను మించిపోయిందంటున్నారు. ప్రోమోకే ఇలా ఉంటే, ఇక ఫుల్ సాంగ్‌‌లో రష్మిక ఇంకెంత రచ్చ చేసి ఉంటుందో అని క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.

శేఖర్ మాస్టర్ స్టెప్పులు, సుకుమార్ టేకింగ్, పల్లెటూరి అందాలు, చంద్రబోస్ లిరిక్స్, సినిమాటోగ్రఫీ.. ఇలా ఒక్కటేమిటీ అన్నీ వెరసి ఈ పాట ‘పుష్ప’ రేంజ్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిపోయిందనాలి.

నో డౌట్, రష్మిక మండన్న కెరీర్‌లోనే ఈ సాంగ్ వెరీ వెరీ స్పెషల్ అవుతుంది. ఇలాంటి పాటలకు ఈ జనరేషన్ హీరోయిన్లలో రష్మిక కంటే బెస్ట్ ఆప్షన్ ఎవరూ వుండరేమోనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆ స్థాయిలో ‘సామి సామి’ సాంగ్ కోసం రష్మిక చెలరేగిపోయింది.. అటు హావభావాల విషయంలోనూ, ఇటు డాన్సుల్లోనూ.