Pushpa Result : ‘పుష్ప’ దెబ్బకి దేవిశ్రీ ప్రసాద్ మైండ్ బ్లాంక్.!

Pushpa Result : అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ విడుదలైంది.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించింది. సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ హిట్టే.. మ్యూజిక్ పరంగా. అల్లు అర్జున్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కూడా అంతే. ‘పుష్ప’ సినిమా విషయంలోనూ మ్యూజిక్ షరామామూలుగానే మ్యాజిక్ చేసేసింది.

కానీ, నేపథ్య సంగీతం విషయంలోనే చాలా విమర్శలు దేవిశ్రీ ప్రసాద్ మీద వినిపిస్తున్నాయి. ‘దేవిశ్రీ ప్రసాద్ మోసం చేశాడు.. అదే తమన్ అయి వుంటేనా.?’ అంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు.

నిజానికి, దేవిశ్రీ ప్రసాద్ కూడా నేపథ్య సంగీతంలో దిట్ట. ఏమయ్యిందో, ‘పుష్ప’ విషయంలో ఆ ‘పవర్’ కొరవడింది. ఎక్కడో ఏదో తేడా కొట్టేసింది. మరీ అంత నాసిరకంగా వుందా.? అంటే, సినిమా స్థాయికి తగ్గట్టు లేదని మాత్రం చెప్పొచ్చు. ఇదే విషయమై దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్ అభిమానుల నుంచి విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.

ఇదిలా వుంటే, ‘పుష్ప’ ప్రదర్శితమవుతున్న కొన్ని థియేటర్లలో సౌండ్ సమస్యల కారణంగా, సినిమాపై నెగెటివిటీ క్రియేట్ అయ్యింది. అది కూడా దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలోకే వెళ్ళిపోయింది. వీఎఫ్ఎక్స్ కూడా నాసిరకంగానే వున్నాయన్న విమర్శలు వస్తున్నా.. ఇతరత్రా లోపాల్ని సినిమాలో ఎత్తి చూపుతున్నా.. ప్రధానంగా దేవిశ్రీ ప్రసాద్ టార్గెట్ అయిపోయాడు.