టాలీవుడ్ లో ఎవరికీ అందని రికార్డ్ సెట్ చేసిన “పుష్ప”

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “పుష్ప పార్ట్ 1”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ అదిరే ప్లానింగ్స్ చేస్తున్న చిత్ర బృందం ఇపుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలన్స్ షూట్ లో బిజీగా ఉన్నారు.

అయితే ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. ఆల్రెడీ ఈ సినిమా టీజర్ టాలీవుడ్ లోనే అత్యధిక వ్యూస్ తో ఆల్ టైం రికార్డు సెట్ చెయ్యగా ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరోకి కూడా దక్కని రికార్డు ని పుష్ప రాజ్ నెలకొల్పాడు. టాలీవుడ్ నుంచి మొట్టమొదటి 2 మిలియన్ లైక్స్ కలిగిన టీజర్ గా పుష్ప టీజర్ సెన్సేషనల్ ఫీట్ ని అందుకుంది.

దీనితో సౌత్ ఇండియన్ సినిమా దగ్గర 2 మిలియన్ లైక్స్ దాటి టీజర్ కలిగిన మూడో హీరోగా బన్నీ నిలిచాడు. మరి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.