Pushpa Raj Heaps For KGF : “కేజీఎఫ్ 2” సినిమాపై “పుష్ప” రాజ్ సంచలన పోస్ట్ వైరల్.!

Pushpa Raj Heaps For KGF

Pushpa Raj Heaps For KGF : లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమాని షేక్ చేసి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొల్లగొడుతున్న భారీ ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడ రాకింగ్ హీరో యష్ బాస్ తో చేసిన ఈ బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా సంచలన విజయాన్ని నమోదు చేసింది. మరి అలాగే ఈ సినిమా అనంతరం పాన్ ఇండియా లెవెల్లో మరో భారీ క్రేజ్ తెచ్చుకున్న హీరోగా యష్ కూడా ఆ లిస్ట్ లో నిలిచాడు.

అయితే యష్ కన్నా ముందు ఈ ప్యాండమిక్ టైం లో పాన్ ఇండియా గేట్లు తెరిచింది మాత్రం ఒక్కడే.. ఆ ఒక్కడే “పుష్ప రాజ్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఈ సినిమా తో అదరగొట్టిన బన్నీ ఈ సినిమా సక్సెస్ తో తానూ పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. మరి ఇప్పుడు ఈ బిగ్ స్టార్ కేజీఎఫ్ 2 సినిమా చూసి హీప్ చేసాడు. సినిమాపై మరియు సినిమా నటీనతులి యష్ నుంచి రవీనా తాండన్ అలాగే శ్రీనిధి శెట్టి మరియు అధీరా సంజయ్ దత్ ల ప్రతి ఒక్కరి పెర్ఫార్మన్స్ లు అదిరిపోయాయని కొనియాడాడు.

అంతే కాకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ పై మాట్లాడుతూ మీ విజన్ కి కన్విక్షన్ కి నా గౌరవం అందిస్తున్నానని ఈ సినిమాతో అదిరే సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించినందుకు థాంక్స్ చెబుతూ మొత్తం చిత్ర యూనిట్ కి పుష్ప రాజ్ బిగ్ కంగ్రాట్స్ చెప్పగా ఈ సంచలన పోస్ట్ వైరల్ అవుతుంది దీనికి బదులుగా ఈ సినిమా యూనిట్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.