రౌడీ బ్రదర్‌కి పుష్పరాజ్ సపోర్ట్

Pushpa Raj Extend Support To Rowdy Brother | Telugu Rajyam

కరోనా ప్యాండమిక్ టైమ్‌లో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అంటూ ఓటీటీ వేదికగా రిలీజైన సినిమాతో మంచి హిట్ కొట్టాడు రౌడీ బ్రదర్ ఆనంద్ దేవరకొండ. కరోనా ప్యాండమిక్‌లో ఉన్న జనానికి ఆ సినిమా చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చిందనడంలో అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడు ఆనంద్ దేవరకొండ నుండి వస్తోన్న మరో మిడిల్ క్లాస్ కామెడీ డ్రామా ‘పుష్పక విమానం’. ఈ సినిమా పోస్టర్లు, ప్రోమోలు మొదట్నుంచీ ఒకింత ఆసక్తికరంగానే అనిపిస్తున్నాయి.

నవంబర్ 12న ఈ సినిమా ధియేటర్‌లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు వేగవంతం చేసింది. అందులో భాగంగా ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోందట చిత్ర యూనిట్. తమ్ముడి సినిమా కదా.. అన్న రౌడీ విజయ్ దేవరకొండ ఎలాగూ వస్తున్నాడు. విజయ్‌తో పాటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని కూడా ఈ ఈవెంట్‌ కోసం రప్పించే యోచనలో ఉన్నారట.

బన్నీ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నాడట. ఈ నెల 30న ఈ భారీ ఈవెంట్‌ జరగనుంది. కాగా, దామోదర్ అను కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్ అయిన కింగ్ ఆఫ్ హిల్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles