Pushpa 3: బన్నీ ఫాన్స్ కు గుడ్ న్యూస్… పుష్ప 3 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్… ఎప్పుడో తెలుసా?

Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణ సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఫ్రాంచైజీతో అల్లు అర్జున్ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

పుష్ప సినిమా 2021 డిసెంబర్లో విడుదల కాగా, దాని సీక్వెల్‌ 2024లో డిసెంబర్ ఐదవ తేదీ రీలీజైంది. మరి పుష్ప 3 ఎప్పుడు? అని అభిమానులు కూడా ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ అభిమానుల ఎదురుచూపుకు నిర్మాత రవిశంకర్ తెరదించారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ పుష్ప 3 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. 2028లో పుష్ప 3 విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారని ఈయన తెలియచేశారు. ఇలా ఈ సినిమా కోసం మరో మూడు సంవత్సరాలు పాటు ఎదురుచూడాల్సిందేనని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ నేషనల్ లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ నేషనల్ అంటూ ప్రేక్షకులను మెప్పించిన పుష్పరాజ్ ఇకపై ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రేక్షకులను సందడి చేయడానికి రాబోతున్నారని తెలుస్తోంది.