Pushpa Part 2 : ‘పుష్ప-2’ షూటింగ్ ఆగిపోయింది!

Pushpa Part 2 :  మొత్తం మీద ‘పుష్ప 2’ షూటింగ్ ప్రారంభమై నిదానంగా సాగుతున్న న్యూస్ చూసి ఫ్యాన్స్ సంతోషించారు. నిర్మాతలు కూడా శరవేగంగా నిర్మాణం పూర్తి చేసి విడుదల చేయాలన్న తొందరలో వున్నారు.

‘పుష్ప 2’ గనుక విడుదలైతే ఈ సంవత్సరం ఇదే చివరి పానిండియా మూవీ అవుతుంది. అందుకని ఈ సంవత్సరం ‘పుష్ప 2’ కి పానిండియా లెవెల్లో పోటీ వుండదు. ఈ అనుకూల పరిస్థితుల్లో షూటింగ్ ఆగిపోవడం ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తోంది.

కారణమేమిటంటే, KGF – చాప్టర్ 2 సక్సెస్ రేంజి చూసిన తర్వాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప2’ విజువల్ అప్‌స్కేలింగ్ కోసం స్క్రిప్ట్ ని రివైజ్ చేయాలనుకుంటున్నారు. కెజిఎఫ్‌కి సీక్వెల్ రికార్డ్ బద్దలు కొట్టిన తర్వాత, ‘పుష్ప: ది రైజ్‌’ కి సీక్వెల్ దాని ట్రాక్‌లో ఆగిపోయింది. దర్శకుడు సుకుమార్ కోరిక మేరకు ఎర్లీ రిలీజ్ కోసం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప 2’ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆల్రెడీ ‘పుష్ప 2’ ని మొదటి భాగం కంటే చాలా పెద్ద రేంజిలో ప్లాన్ చేశారు. మొదటి భాగం అంచనాలకు మించి విజయం సాధించడంతో బడ్జెట్‌ను పెంచి యాక్షన్‌ సీక్వెన్స్ ని మెరుగుపరిచారు.

కానీ ఇప్పుడు KGF – చాప్టర్ 2 అన్ని రికార్డులను బద్దలు కొట్టడంతో, సుకుమార్ మరింత అప్ గ్రేడ్ చేయాలని కోరుకుంటున్నారు.

సుకుమార్ ఇలా చేసి ట్రాప్ లో పడుతున్నారా? ఇప్పుడాయన ‘పుష్ప –ది రైజ్’ కాదు, ‘కేజీఎఫ్ 2’ కి మించిన స్థాయిలో ‘పుష్ప2’ వుండాలని షూటింగ్ ఆపడం, ఈ వార్తలు పొక్కడం చూస్తే, ఆయన ప్రేక్షకుల అంచనాలని అందనంత హై రేంజికి పెంచేసినట్టయ్యింది.

ప్రేక్షకులు ఇప్పుడు ‘పుష్ప2’ చూసి ‘కేజీ ఎఫ్ 2’ తో పోల్చుకునే పరిస్థితిని సుకుమార్ కల్పించారు. ఈ వార్త లీక్ కాకుండా చూసుకుని, చేసేదేదో సైలెంట్ గా చేసుకుపోయుంటే సేఫ్ గా వుండేదేమో?

***