RRR: ఈ విషయంలో “పుష్ప” కూడా “RRR” తో సమానంగా వచ్చేసిందట.!

RRR : ఈ ఏడాది టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న ఏకైన భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాని తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. మరి భారీ అంచనాలతో ఉన్న ఈ చిత్రాన్ని ఇంకొన్ని రోజుల్లో విడుదల చేస్తుండగా ఇప్పుడు ఒక ఆసక్తికర అంశం బజ్ లాగ వినిపిస్తుంది.

వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న మరో భారీ సినిమా ట్రిపుల్ ఆర్ (RRR) కి సమానంగా పుష్ప కూడా వచ్చేసిందట. ఇంతకీ ఏ విషయంలో అంటే సినిమా నిడివి ప్రకారం రెండు సినిమాలు దాదాపు ఒకలాగే వచ్చాయట. రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీసిన భారీ సినిమా 3 గంటల 6 నిముషాలు రాగా సుకుమార్, బన్నీ ల పుష్ప మాత్రం 3 గంటలు దగ్గర దగ్గరకి వచ్చేసిందట.

దీనితో రెండు పాన్ ఇండియన్ సినిమాలు కూడా మూడేసి గంటలు ఆడియెన్స్ ని థియేటర్స్ లో ఉంచుతాయట. సుకుమార్ ఫస్ట్ టైం కంప్లీట్ మాస్ చిత్రం చేస్తున్నారు అందరిలో ఈ సినిమా పట్ల చాలా ఆసక్తి ఉంది. మరి పుష్ప పై ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది.