Pushpa OTT Release : డేట్, టైంలతో “పుష్ప” ఓటిటి రిలీజ్ కన్ఫర్మ్.! ఆ ఒక్క భాష తప్ప అన్ని భాషల్లోనూ

Pushpa OTT Release :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ భారీ సినిమా సినిమా “పుష్ప పార్ట్ 1” తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి తన దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ హ్యాట్రిక్ సినిమా భారీ అంచనాలు నడుమ పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ అయ్యి అదరగొట్టింది.

అయితే ఇంకా థియేటర్స్ లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా చుట్టూ గత కొన్ని రోజులుగా ఓటిటి రిలీజ్ పై ఊహాగానాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా జనవరి 7 నుంచే దిగ్గజ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుంది అని. మరి ఇప్పుడు దీనిని నిజం చేస్తూ ఒక అధికారిక పోస్టర్ ప్రకటన కూడా వచ్చేసింది.

ఈ సినిమాని ఈ జనవరి 7 నుంచే ప్రైమ్ వీడియో వారు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక అలానే దీనిని ఆరోజు రాత్రి 8 గంటల నుంచి ప్రసారం చేయనున్నట్టుగా తెలిపారు. అయితే ఇక్కడ హిందీ భాషలో స్ట్రీమింగ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఎందుకంటే ఈ సినిమా ఇంకా హిందీలో బాగానే రన్ అవుతున్నందున మేకర్స్ కోరిక మేరకు దానిని అపారట. ఇక ఈ భారీ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ 2 భాగాలుగా తీస్తున్నారు.