Pushpa Movie Success Meet Canceled: అల్లు అర్జున్ అభిమానులకి బాడ్ న్యూస్.. కాన్సిల్ అయిన మీట్

Pushpa Movie Success Meet Canceled: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప’ బాక్సఫీసు దగ్గర కలెక్షన్స్ తో బెంబోలిస్తుంది. బొమ్మ ఏ థియేటర్లో ఆడినా ‘తగ్గేదేలే’ అంటూ కలెక్షన్లు రాబడుతుంది. భాషా బేధం లేకుండా.. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా దేశంలో ఉన్న సినీ ప్రియులందరికీ పూనకాలు తెప్పిస్తుంది పుష్ప చిత్రం. ముందు డివైడ్ టాక్ అందుకున్నా.. ఆ తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చిన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్, ఫహాద్ ఫాసిల్, అజయ్ గోష్, తదిరులు కీలక పాత్రలు పోషించారు.

అయితే పుష్ప సినిమా తాజాగా వందకోట్ల క్లబ్‏లో చేరిపోయింది. దీంతో పుష్ప సక్సెస్ పార్టీని వేరె లెవల్ లో ఎంజాయ్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ సందర్భంగా.. వరుసగా పలు ప్రాంతాల్లో పుష్ప సక్సెస్ పార్టీ నిర్వహిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పుష్ప మూవీ మేకర్స్

ఈ క్రమంలోనే ఈరోజు కాకినాడలో పుష్ప సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు చిత్రయూనిట్ నిన్న ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను కూడా దాదాపు పూర్తిచేసింది. అయితే పుష్ప సక్సెస్ మీట్ నిర్వహించేందుకు అనుమతులు రాకపోవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఇదిలా ఉంటే.. పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.