ఏ మాత్రం తగ్గని పుష్ప క్రేజ్.. ఏకంగా మార్కెట్లోకి విడుదలైన పుష్ప షర్ట్స్!

గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ సినిమాకు ముఖ్యంగా నార్త్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి.ఈ సినిమాలోని డైలాగులు పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకొని సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ పాటలకు ఎంతోమంది రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇలా ఎప్పటికప్పుడు ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఈ సినిమాలో తగ్గేదే లే అనే డైలాగ్ వాడుతూ ఈ సినిమా ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇకపోతే ఈ సినిమా విడుదలయ్యే సుమారు ఆరు నెలలు దాటిపోయినా ఇంకా ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అని చెప్పాలి.తాజాగా పుష్ప సినిమా షర్ట్స్ మార్కెట్ లోకి విడుదల కావడంతో మరోసారి ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోనే కొందరు యువకులు పుష్ప సినిమాలు అల్లు అర్జున్ రష్మిక మందన్న ఉన్న గెటప్స్ తో కూడిన చొక్కాలను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఒక సినిమా విడుదలైన తర్వాత ఆరు నెలల వరకు ఆ సినిమా క్రేజ్ కొనసాగడం బహుశా పుష్ప సినిమా విషయంలోనే జరిగిందేమో అని చెప్పాలి. ఇక పుష్ప సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.