పుష్ప’ హిందీ డీల్ క్యాన్సిల్ అయిందా ?

Pushpa makers to cancel old hindi deal
Pushpa makers to cancel old hindi deal
 
అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’.  సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం.  పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఉండనుంది.  మొదట ఒక సినిమాగానే మొదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు రెండు భాగలుగా చేయాలని నిర్ణయించారు. మారిన ప్లాన్స్ మేరకు మొదటి భాగం షూటింగ్ చాలావరకు పూర్తికాగా ఇంకాస్త మాత్రమే బాకీ ఉంది.  ఒక్క షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు టీమ్.  ఇదిలా ఉండగా సినిమాకు ఇదివరకు చేసుకున్న హిందీ రైట్స్ డీల్ ను నిర్మాతలు రద్దు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 
 
మొదట చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసినా ఒక్క భాగంగానే అనుకున్నారు.  ఆ మేరకు హిందీ హక్కులను 17 కోట్లకు డీల్ కుదిర్చారట. కానీ ఇప్పుడు సినిమాను 1,2 అంటూ రెండు భాగాలు చేస్తున్నారు. దీంతో మైత్రీ మూవీస్ వెచ్చించే బడ్జెట్ కూడ బాగా పెరిగింది. దీంతో హక్కులను విడివిడిగా లేదా కలిపి అత్యధిక ధరకు విక్రయించాల్సి ఉంది.  అప్పుడే నిర్మాతలకు లాభాలు వస్తాయి.  కాబట్టి ముందు చేసుకున్న హిందీ డీల్ క్యాన్సిల్ చేసుకుని రెండు భాగాల హక్కులను 35 నుండి 40 కోట్ల మధ్యలో విక్రయించాలని నిర్మాతలు చూస్తున్నారట. అయితే దీనికి ఏడాది కృతమే రైట్స్ కొనుగోలుచేసిన డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.