Pushpa : పేరుకే పాన్ ఇండియా సినిమా..”పుష్ప”కి ఎన్ని థియేటర్స్ తెలిస్తే షాక్.!

Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న భారీ చిత్రం “పుష్ప”. తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో ప్లాన్ చేసిన ఈ భారీ సినిమా మొదట తెలుగు సినిమానే స్టార్ట్ అయ్యి తర్వాత పాన్ ఇండియన్ స్థాయికి ప్లాన్ చేశారు. అయితే ముందు అంతా చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేసినా తర్వాత తర్వాత అసలు పాన్ ఇండియా సినిమాకి ఉండాల్సిన ఎలిమెంట్స్ చాలా వాటినే మిస్ చేసారని ఒక్కక్కటిగా క్లారిటీ వస్తుంది.

అయితే అసలు ఇంకా తేలిపోయిన అంశం ఏమిటంటే దీనిని పాన్ ఇండియా సినిమా అని అంటున్నారు కానీ ఆ రేంజ్ థియేటర్స్ లో అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వట్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కేవలం 3 వేల థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందట. అందులోని ఒక్క తెలుగు థియేటర్స్ వెయ్యికి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందట.

అసలు పాన్ ఇండియా సినిమా అంటేనే మినిమమ్ నాలుగు థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలి కానీ ఈ సినిమాకి మూడు వేలే దక్కాయి. మరి పాన్ ఇండియన్ సినిమా అని ఇది పేరుకే రిలీజ్ అవుతుంది. ఇక వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.