Pushpa box-office: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనంలా దూసుకుపోతుంది. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ కి మాత్రం యనానిమస్ గా జై కొట్టారు. యావరేజ్ టాక్ తో ఈ రేంజ్ లో వసూళ్లు సాధించటం బన్నీ స్టామినాగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు.
పుష్ప రిలీజైన మొదటి రోజు 45 కోట్లు వసూలు చేసి శుభారంభాన్నిచ్చింది. అయితే యావరేజ్ టాక్ రావడంతో కమర్షియల్ గా కూడా గట్టెక్కలేదని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. అయితే అనూహ్యంగా ప్రతిరోజూ మంచి వసూళ్లు సాధిస్తూ అందరకి షాక్ ఇస్తుంది. బాక్సాఫీస్ నుండి అందిన సమాచారం ప్రకారంగా పుష్ప 6వ రోజు(బుధవారం)న 11-12 కోట్ల (అన్ని భాషలతో కలిపి) బిజినెస్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆరు రోజులకు 150 కోట్ల మొత్తాన్ని పుష్ప సాధించింది.
#Pushpa has emerged as a dark horse at the #BO… Audience-favourite, exhibitors-favourite [mass pockets esp] and #BO-favourite… Solid hold on weekdays… Fri 3.31 cr, Sat 3.77 cr, Sun 5.54 cr, Mon 3.68 cr, Tue 3.57 cr, Wed 3.36 cr. Total: ₹ 23.23 cr. #India biz. #PushpaHindi pic.twitter.com/1P6yftdRlr
— taran adarsh (@taran_adarsh) December 23, 2021
ఇక నార్త్ లో మనోడు దుమ్ము దులిపేస్తున్నాడని తెలుస్తుంది. అక్కడ స్థిరంగా వసూళ్లు సాధిస్తూ పంపిణీదారులు సేఫ్ సైడ్ కి వచ్చేశారని సమాచారం. ప్రముఖ బాలీవుడ్ బాక్సాఫీస్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో ఇప్పటివరకు ‘పుష్ప’ మూవీ హిందీలో 24 కోట్లపైన కలెక్ట్ చేసిందని పేర్కొన్నారు. అలానే USAలో $2 మిలియన్ల వసూలు దిశగా దూసుకుపోతోంది. ఈ వారాంతంలో ఆ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. అయితే ‘శ్యామ్ సింగ్ రాయ్’, ’83’ సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పుష్ప ఏమేరకు నిలబడుతుందో చూడాలి.