Pushpa : “పుష్ప” సినిమాకి దక్కిన అరుదైన గౌరవం.. వారికి చెందాల్సిందే అట.!

Pushpa :  చాలా కాలం తర్వాత మళ్ళీ మన తెలుగు సినిమా నుంచి వచ్చిన కొన్ని చిత్రాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కొన్ని చిత్రాలు జస్ట్ గత ఏడాది చివరి నెల డిసెంబర్ లోనే వచ్చాయి అని చెప్పాలి. మరి ఆ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం “పుష్ప పార్ట్ 1” కూడా ఒకటి. దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

టోటల్ పాన్ ఇండియా మార్కెట్ దగ్గర రిలీజ్ అయ్యి బంపర్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఏదన్నా ఉంది అంటే అది సుకుమార్ ప్రెజెంటేషన్ మరియు అల్లు అర్జున్ పాత్రలే అని చెప్పాలి. సుకుమార్ ఎక్కడా కూడా వదలని సహజత్వం ఇప్పుడు ఈ సినిమాకి మరో అరుదైన ఘనతను తెచ్చిపెట్టింది.

మన దేశంలో సినిమాల పరంగా అత్యున్నత జాతీయ పురస్కారం అయినటువంటి దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ఇప్పుడు ఈ చిత్రాన్ని వరించడం ఇప్పుడు తెలుగు సినిమాకి మరింత గర్వకారణంగా నిలిచింది. దీనితో మళ్లీ ఇండియన్ సినిమా దగ్గర పుష్ప సినిమా పేరు వైరల్ అవుతుండగా అభిమానులు సహా మూవీ లవర్స్ ఈ సినిమాకి ఈ అవార్డు రావడంలో తప్పు లేదని ఆ క్యాలిబర్ ఈ సినిమాలో ఉందని ఎక్కడా నెగిటివ్ కామెంట్స్ కి అయితే ఎవరూ పోవట్లేదు.

ఇలా మొత్తానికి పుష్ప సినిమా మరో మారు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.