“పుష్ప” కొత్త సాంగ్ అదిరింది కానీ బన్నీ దెబ్బేసాడు.!

 
ఐకాన్ స్టార్ అల్లు అర్జు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తీసిన భారీ సినిమా “పుష్ప” రెండు భాగాలుగా చేస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగం నుంచి ఇప్పుడు అప్డేట్స్ అన్నీ వస్తున్నాయి. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు చిత్ర బృందం సినిమాలోని నాలుగో సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ కి కూడా దేవి అదరగొట్టేసాడు. 
 
మాస్ ఆడియెన్స్ కి పక్కాగా రీచ్ అయ్యే మాస్ సాంగ్ ని మళ్ళీ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ పాటలో చంద్ర బోస్ ఇచ్చిన లిరిక్స్ హైలైట్ వాటికి తగ్గట్టుగా దేవి అదరగొట్టాడు కానీ బన్నీ పరంగా కాస్త దెబ్బ పడింది అని చెప్పొచ్చు. సాంగ్ లో తన లుక్స్ చాలా బాగున్నాయి కానీ ఇలాంటి మాస్ సాంగ్ కి కూడా రొటీన్ స్లో స్టెప్పులే చెయ్యడం బన్నీ ఫ్యాన్స్ కి ఖచ్చితంగా నిరాశ కలిగించే అంశం. 
 
లాస్ట్ డీజే నుంచి బన్నీ ఇదే చేస్తున్నాడు. తాను ఎలాంటి డాన్సర్? అలాంటిది ఈ మాస్ సాంగ్స్ కి కూడా సరైన డాన్స్ చెయ్యకపోతే తన ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసినట్టే మరి. ఇక సినిమాలో అయినా అంచనాలు రీచ్ అయ్యే విధంగా ఉంటుందో లేదో చూడాలి.