Pushpa Box-office Report : బాక్సాఫీస్ రిపోర్ట్ : “పుష్ప”కి హిందీలో షాకింగ్ వసూళ్లు 16వ రోజు అయితే రికార్డే.!

Pushpa Box-office Report : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కాస్తా నిజం గానే ఐకాన్ స్టార్ గా మార్చివేసిన చిత్రం “పుష్ప”. టాలీవుడ్ మోస్ట్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా అనేక అడ్డంకులుతోనే ఎట్టకేలకు అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి అదరగొట్టింది. మొదటి రోజే బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డు వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ మార్కెట్ లో ఊహించని ఓపెనింగ్స్ అందుకుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు తెలుగులో మించి హిందీలో వసూళ్లు అదిరిపోయే రేంజ్ లో వస్తుండడం గమనార్హం. ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్న శనివారంతో 16 రోజులు కంప్లీట్ అయ్యాయి. మరి ఈ 16 రోజులకి గాను పుష్ప హిందీ వెర్షన్ ఒక్క దానిలోనే ఏకంగా 56 కోట్లు రాబట్టినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఇక్కడే ఒక షాకింగ్ అంశం ఏమిటంటే ఇప్పటి వరకు పుష్ప కి అక్కడ వచ్చిన అన్ని రోజులు వసూళ్ల కన్నా ఈ 16వ రోజునే అత్యధికంగా రావడం విశేషం. ఈ 16వ రోజు పుష్ప ఏకంగా 6 కోట్లు రాబట్టిందట. ఇదే ఈ సినిమాకి అక్కడ ఇప్పటివరకు అత్యధికం. దీనితో పుష్ప అక్కడ 16 రోజులకి గాను 56 కోట్లు రాబట్టిందట.

పుష్ప మున్ముందు మరిన్ని వండర్స్ నమోదు చెయ్యడం కన్ఫర్మ్ అని బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఏఈ వసూళ్లతో పుష్ప ప్రపంచ వ్యాప్తంగా 16 రోజులకి గాను 309 కోట్ల మేర గ్రాస్ ని రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.