Pushpa Ban : ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వస్తున్న ఇంకో భారీ రిలీజ్ కి కేవలం ఇంకొన్ని గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప పార్ట్ 1”. రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తీసిన ఈ సినిమా గట్టి ప్రమోషన్స్ తో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సరే ఇదిలా ఉండగా చివరి నిమిషంలో మారం పుష్ప సినిమాకి దెబ్బలు తప్పడం లేదు. ఒకపక్క ప్రింట్ లేట్ లు సెన్సార్ లేట్ లు అనుకుంటే ఇప్పుడు కొత్తగా సినిమా బ్యాన్ చెయ్యాలి అంటే షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అది ఎక్కడో కాదు కన్నడ లోనే.. కన్నడ ప్రేక్షకులే ఇప్పుడు ఈ సినిమాని తమ కన్నడలో బ్యాన్ చెయ్యాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
అయితే దీనికి కారణం కూడా తెలుస్తుంది. అక్కడ ఈ చిత్రాన్ని వారి మాతృ భాష అయినటువంటి కన్నడ లో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చెయ్యకుండా తెలుగులో ఎక్కువగా చేస్తున్నారట. అయితే అక్కడ తెలుగు వారు కూడా ఎక్కువ ఉంటారన్న సంగతి తెలిసిందే.
అయినా కూడా ఎలాగో కన్నడ రిలీజ్ అని చెప్పినపుడు అందులో రిలీజ్ చెయ్యకుండా ఈ చిన్న చూపు ఏంటి అని కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటప్పుడు కన్నడ అని పెట్టుకోవడం ఎందుకు డైరెక్ట్ గా తెలుగు లోనే రిలీజ్ చెయ్యొచ్చు కదా అని వారి వాదన. దీనితో ఈ సినిమాకి అక్కడ ఇంకో దెబ్బ పడేలా ఉందని చెప్పాలి.