Gallery

Home News మహేష్ నిర్లక్ష్యం చేసిన పూరిని పవన్ పట్టించుకుంటాడా ?

మహేష్ నిర్లక్ష్యం చేసిన పూరిని పవన్ పట్టించుకుంటాడా ?

Puri Jagannadh To Approach Pawan Kalyan

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమణ’. దీన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనేది పూరి కోరిక. మహేష్ డేట్స్ కోసం ఆయన చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. కానీ బిజీ షెడ్యూల్స్ మూలంగా మహేష్ బాబు పూరితో సినిమా చేయలేకపోతున్నారు. దీంతో పూరి ఇప్పటికే చాలా ఆలస్యమైందని భావించి ఆ కథను వేరొకరితో చేయాలని డిసైడ్ అయ్యారట. ఇదివరకు ఈ కథలో సోనూ సూద్ ను తీసుకోవాలని పూరి జగన్నాథ్ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పవన కళ్యాణ్ పేరు తెర మీదకు వచ్చింది.

ఈ కథను పూరి పవన్ వద్దకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. టాలీవుడ్లో సోషల్ సబ్జెక్ట్స్ చేయడానికి పవన్ చాలా మంచి ఆప్షన్. పైగా పూరి, పవన్ రాపో చాలా బాగుంటుంది. గతంలో కూడ ఇద్దరూ రెండు సినిమాలు చేశారు. అందుకే మహేష్ నెగ్లెట్ చేస్తున్న కథను పవన్ తో చేయించి తన కోరిక నెరవేర్చుకోవాలని పూరి భావిస్తున్నారట. పవన్ అసలే సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఈ ఊపులో పూరి గనుక అప్రోచ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇచ్చేస్తాడు. అభిమానులైతే వీరి కాంబినేషనే సెట్టవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Posts

పోరు గడ్డపై ఉప పోరు

ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ. ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కూడా అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు కూడా కరీంనగర్నే సెంటిమెంట్ జిల్లాగా ఎంచుకున్నాడు. ఇక్కడి నుంచే మలి...

కేంద్ర మంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్.. అంత సీన్ వుందా.?

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అరడజను సీట్లలో పోటీ చేసే అవకాశమూ దక్కించుకోలేకపోయింది జనసేన పార్టీ. బీజేపీ కంటే ఓట్ల శాతం పరంగా మెరుగ్గానే వున్నా, తిరుపతి ఎంపీ టిక్కెట్టుని...

యాక్షన్ షురూ చేసిన సీఎం జగన్ ! త్వరలో ‘RRR’పై వేటు ఖాయం !

గత కొంతకాలం నుండి వైసీపీ పార్టీ, సీఎం జగన్ మీద సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు ఎదురుదాడి చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధ్యక్షుడు మిన్నకుండి పోవటంతో నాయకుల,...

Latest News