పూరి జగన్నాధ్ అసమర్ధుడేమీ కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వి.వి. వినాయక్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ దర్శకుడుగా గుర్తింపు పొందిన వీవి నాయక్ గురించి తెలియని వారంటూ ఉండరు. యాక్షన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వివి వినాయక్ ఇటీవల పూరి జగన్నాథ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివి వినాయక్ లైగర్ సినిమా ప్లాప్ గురించి ప్రస్తావిస్తూ పూరి జగన్నాథ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవల విడుదల డిజాస్టర్ గా నిలిచింది. దీంతో విజయ్ తో పాటు పూరి జగన్నాథ్ ని కూడా ట్రోల్ చేస్తున్నారు. లైగర్ దెబ్బతో పూరి జగన్నాథ్ పని అయిపోయిందని.. ఇక జీవితంలో అతను కోలుకోలేడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పై ఇటీవల స్పందించిన వి వి వినాయక్ స్పందిస్తూ.. గతంలో కూడా పూరి జగన్నాథ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడని.. ఆయన ప్రతిభ గురించి పూరి సన్నిహితులకు మాత్రమే తెలుసని చెప్పుకొచ్చాడు.

‘లైగర్‌’ వల్ల పూరి జీవితం ఏమీ మారిపోలేదు. ఆయన గతంలో తీసిన సినిమాలు ఎన్నో ఫ్లాప్స్‌, హిట్స్‌, సూపర్‌హిట్స్‌ చూశాయ్యాయి. ఎన్నో ప్లాప్ లను చూసిన పూరి జగన్నాథ్ ‘పోకిరి’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకొని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో లాభనష్టాలు అన్నవి సహజం . లైగర్ సినిమా వల్ల పూరి జగన్నాథ్ నష్టపోయింది నిజమే కానీ ఆ సినిమా వల్ల నష్టపోయానని పూరి జగన్నాథ్ బాధపడుతూ ఉండే రకం కాదు. అతను ఒక యోగి అతను ఒక ధైర్యవంతుడు పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోలేనంత అసమర్థుడు పూరి జగన్నాథ్ కాదు అంటూ వివి వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.