Puri Jagannadh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పాన్ ఇండియా స్టార్లుగా కొనసాగుతున్న వారందరికీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించిన ఘనత పూరి జగన్నాథ్ కు ఉంది. ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోలకు సక్సెస్ అందించిన పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్ సినిమాలను మూట కట్టుకున్నారు. గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ చేసే సినిమాలకు పెద్దగా ఆదరణ రాలేదని చెప్పాలి.
పూరి జగన్నాథ్ ఇటీవల రామ్ పోతినేనితో కలిసి డబల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో ఈయనకు తదుపరి అవకాశం ఇచ్చే హీరోలు కూడా ఇండస్ట్రీలో ఎవరు లేరనే చెప్పాలి. ఎవరు కూడా పూరితో సినిమాలు చేయటానికి ముందుకు రాలేదు. ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ బాలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు ఈ సినిమాకు భవతీ భిక్షాందేహి అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పూరి జగన్నాథ్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఇటీవల మీ రికార్డ్స్ చూసుకుంటే అన్ని ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మీ రికార్డ్స్ చూడకుండా మీరు కథ చెబితే మీతో వెంటనే సినిమా చేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు పూరి జగన్నాథ్ ఊహించని సమాధానం చెప్పారు. నా హిస్టరీ చూడకుండా నేను అడిగితే కాదనకుండా సినిమాలు చేసే హీరో బాలయ్య మాత్రమే అంటూ పూరి జగన్నాథ్ చెప్పిన ఈ సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయనతో పూరి జగన్నాథ్ పైసా వసూల్ సినిమా చేశారు ఇది కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా పూరి జగన్నాథ్ అడిగితే బాలయ్య కాదనరని చెప్పడంతో బాలయ్య మనసు బంగారం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.