Purandeshwari: బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ మీడియా ఛానల్ తనను లోకేష్ గురించి ప్రశ్నించింది. తెలుగుదేశం పార్టీని నడిపించే సామర్థ్యం లోకేష్ కు ఉందా.. లోకేష్ పెద్దమ్మ గా మీరు ఏమి చెబుతారని ప్రశ్నించారు.
దాంతో.. లోకేష్ తల్లి భువనేశ్వరి సోదరిగా లోకేష్ కు తన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపింది. తన సొంత లక్ష్యాలను, మార్గాన్ని తానే నిర్దేశించుకోవచ్చు అని తెలిపింది. ప్రస్తుతం తెలుగుదేశంలో నాయకత్వం వహించిన బోయేది నారా లోకేష్ అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను ఈ విషయం గురించి ఇలా స్పందించింది. అంతేకాకుండా తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, తన కుమారుడు హితేష్ గురించి కూడా కొన్ని విషయాలు తెలిపింది.