Nani vs Natti kumar: ఏపీ ప్రభుత్వంపై హీరో నాని వ్యాఖ్యలను తప్పుబట్టిన నిర్మాత నట్టికుమార్

Producer Natti Kumar countered Nani's comments

Nani vs Natti kumar: గతకొంతకాలంగా ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారంలో ప్రభుత్వానికి-ఇండస్ట్రీకి మధ్య రచ్చ జరుగుతుంది. ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన జీవో ప్రకారం ఆ ధరలకు థియేటర్లను నడపలేమని చాలామంది క్లోజ్ చేశారు. ఇటీవల కాలంలో ఏపీలో విడుదలైన అన్ని చిత్రాలకు కలెక్షన్స్ పరంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో పలుమార్లు ఇండస్ట్రీ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది.

ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఏకంగా తన బ్యానర్ లో వచ్చే సినిమాలు ఓటిటి లో రిలీజ్ చేసుకుంటామని చెప్పేశారు. ఈ విషయంలో హీరో పవన్ కళ్యాణ్, ఏపీ ప్రభుత్వ వైఖిరిని కొన్ని రోజుల క్రితం సభాముఖంగా ప్రశ్నించటం చర్చనీయాంశమైంది. ఇక తాజాగా నాచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగ్ రాయ్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… “ఏపీలో ధియేటర్ కంటే కిరాణా షాప్ కలెక్షన్ లు బెటర్ గా ఉన్నాయని” ఆయన అన్నారు. టికెట్ రేట్స్ త‌గ్గించ‌డం అనేది ప్రేక్ష‌కుల‌ను అవ‌మానించిన‌ట్టేనని అన్నారు.

అయితే నాని వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మాత నట్టి కుమార్ కౌంటర్ వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద చర్చకు తెరతీసింది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నాం. దీనిపై కోర్టులో కేసు కూడా నడుస్తుంది. సినిమా టికెట్ రేట్స్, కలెక్షన్స్ గురించి ఏం తెలుసని నాని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలతో మిగిలిన సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఏపీ ప్రభుత్వానికి నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో అని సినీ విశ్లేషకులు చర్చిస్తున్నారు.