Chitti Babu: నీ బెదిరింపులు మా దగ్గర కాదు పవన్… సిగ్గుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకో… ఫైర్ అయిన చిట్టిబాబు!

Chitti Babu: సినిమా ఇండస్ట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ అని పిలుపునివ్వడంతో పవన్ కళ్యాణ్ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి కృతజ్ఞతలు. ఎన్ డి ఏ ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది అవుతున్న ఇప్పటికే సినీ సంఘాల వారు వచ్చి ఏపీ ముఖ్యమంత్రిని కలవలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ పెద్దల గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చలకు కారణమయ్యాయి. ఇలాంటి తరుణంలోనే సీనియర్స్ నిర్మాత చిట్టిబాబు ఓ మీడియా సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మీ బెదిరింపులకు బ్లాక్మెయిల్ ట్రిక్కులకు మేము భయపడము. ఇలాంటివన్నీ సినిమా వాళ్ళ మీద చూపించకు.

మీరు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చండి. నువ్వు ఒక అబద్ధాల కొరివివి. ఎన్నికలకు ముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడుతున్నావు. జగన్ ప్రభుత్వంలో 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పావు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న నువ్వు ఆ 32,000 మంది అమ్మాయిల ఆచూకీ ఎక్కడో కనుక్కోగలవా అంటూ ప్రశ్నించారు.

విశాఖ ఫ్యాక్టరీ గురించి గతంలో మాట్లాడావు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. తిరుపతిలో పాచిపోయిన లడ్డులు కాకినాడలో 25 టన్నుల గంజాయి గురించి గతంలో మాట్లాడిన నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత అది డ్రై ఐస్అంటూ చెప్పుకు వచ్చావు. వీటన్నిటికీ మీ సమాధానం ఏంటి?

మీరు అధికారంలోకి రావడం కోసమే కేవలం ప్రజలను ఆకర్షించడానికి ఇలాంటి అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ప్రజలకు నిరుద్యోగ భృతి అని, అమ్మబడి, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ అంటూ దొంగ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారంటూ చిట్టిబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు.